హైదరాబాద్, 10 జూలై (హి.స.)
చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి లబ్దిదారుల ఖాతాలలో రుణమాఫీ నిధులు వెంటనే జమ చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పనీతీరుపై ఇవాళ హైదరాబాద్ లో చేనేత జౌళిశాఖ అధికారులతో తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పోరేషన్ల నుండి సంవత్సరానికి సంబంధించి వారికి అవసరమైన వస్త్రాల కోసం సెప్టెంబర్ నెలలోగానే ఆర్డర్లు తెప్పించుకోవాలి. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు దుస్తుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టెస్కో షోరూంల పనితీరును మెరుగుపరిచి ఫలితాలు రాబట్టాలని స్వయం సహాయక సంఘాల మహిళలకు అందచేసే మహిళశక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..