ఓటరు జాబితా పారదర్శకతలో బీఎల్ఎల పాత్ర కీలకం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
తెలంగాణ, నల్గొండ. 10 జూలై (హి.స.) పారదర్శక ఓటరు జాబితా తయారీలో బీఎల్ఎల పాత్ర కీలకమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో బీఎలీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మా
నల్గొండ కలెక్టర్


తెలంగాణ, నల్గొండ. 10 జూలై (హి.స.) పారదర్శక ఓటరు జాబితా తయారీలో బీఎల్ఎల పాత్ర కీలకమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో బీఎలీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఓటరు జాబితా తయారీలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే జాబితా రూపొందించాలన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటరు జాబితా ముఖ్యమని, అర్హులు మాత్రమే ఓటరుగా ఉండేలా చూడాలన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని బీఎలీలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణ సందర్భంగా సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande