నాట్స్ సంబ‌రాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట..
హైదరాబాద్, 10 జూలై (హి.స.) అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు (8th NATS Telugu Celebrations) వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేదిక ప్రాంగణం తెలుగు వాళ్ళతో క్రిక్కిరిసిపోయింది.ఈ సంబరాల్లో నందమూరి బాల
నాట్స్ సంబరాలు


హైదరాబాద్, 10 జూలై (హి.స.)

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు (8th NATS Telugu Celebrations) వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేదిక ప్రాంగణం తెలుగు వాళ్ళతో క్రిక్కిరిసిపోయింది.ఈ సంబరాల్లో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ , అల్లు అర్జున్, శ్రీలీల తో పాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేసారు…థమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ తో ఉర్రుతలూగించారు… తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈ తెలుగు సంభరాలు అంభరాన్ని అంటాయి… సంబ‌రాలే కాక సామాజిక బాధ్య‌తగా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి నాట్స్‌ 85లక్షల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్‌, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు అందజేశారు. మరియు నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande