తెలంగాణ, మహబూబ్నగర్. 10 జూలై (హి.స.) మహబూబ్నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలో గల మంగలోని వంపు వద్ద కల్వర్టును గురువారం నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వర్టు నిర్మాణంతో ఈ ప్రాంత రైతులకు కూడా పొలాలకు వెళ్లేందుకు అనువుగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు నాయీ బ్రాహ్మణులు భాజా భజంత్రీలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డిని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు సన్మానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు