ఏం చేయబోతున్నామనేది తర్వాత చెబుతాం.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 10 జూలై (హి.స.) క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో వరంగల్ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఇష్యూ పై రెండు గంటల పాటు చర్చించాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలు చె
మల్లు రవి కీలక వ్యాఖ్యలు


హైదరాబాద్, 10 జూలై (హి.స.)

క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో వరంగల్ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఇష్యూ పై రెండు గంటల పాటు చర్చించాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలు చెప్పారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు ఏం చేయాలనేది తర్వాత చెబుతాం. మరోసారి భేటీ ఎప్పుడు ఉంటుందనేది సమాచారం ఇస్తాం అని మల్లు రవి మీడియాకు వివరించారు. మల్లు రవితో భేటీ అయిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ఉన్నారు. కొండా మురళి అంశంపై కమిటీ మందు వాదనలు వినిపించారు. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇటీవల క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు కొండా మురళి వివరణ ఇచ్చారు. తాజాగా ఆయన వ్యతిరేక వర్గం ఇవాళ వాదనలు వినిపించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande