అవకాశం ఇస్తే.. మళ్లీ HCA బాధ్యతలు స్వీకరిస్తా: మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ప్రకటన
హైదరాబాద్, 10 జూలై (హి.స.) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్రావుతోపాటు హెచ్సీఏ సభ్యు
అజారుద్దీన్ ప్రకటన


హైదరాబాద్, 10 జూలై (హి.స.)

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు

అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్రావుతోపాటు హెచ్సీఏ సభ్యులను కూడా సీఐడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఈ పరిణామాలపై హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధ్యక్షుడి అరెస్ట్ హెచ్సీఏకు అవమానం అని అన్నారు. టికెట్లు ఇచ్చిన తర్వాత అదనపు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఒప్పుకోకపోతే వేధించే ప్రయత్నం చేయడం దారుణమని సీరియస్ అయ్యారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు తాను ఎంతో చేశానని అన్నారు. తక్షణమే అసోసియేషన్ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవకాశం వస్తే.. తాను మళ్లీ HCA బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమని ప్రకటించారు. గ్రూపు రాజకీయాలు పక్కనబెట్టి ఆటపై దృష్టి పెట్టాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande