హైదరాబాద్, 10 జూలై (హి.స.)
భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడి కి లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయించుకున్నారని ఆరోపించారు. దీంతో లోయర్ సీలేరు పనర్ ప్లాంట్ను లాగేసుకొని తెలంగాణలో కరెంట్ కష్టాలకు కారకులయ్యారని ఆరోపించారు. పోలవరం పేరుతో భద్రాచల శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయాన్ని ముంచేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏడు మండలాలను ఏకపక్షంగా విలీనం చేసుకోవడంతో భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్న... పట్టణాన్ని ఆనుకొని ఉన్న యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..