బీదర్ టూ హైదరాబాద్ గంజాయి సప్లై.. నిందితుడు అరెస్ట్
హైదరాబాద్, 10 జూలై (హి.స.) కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తుమ్న ఎండు గంజాయి ని గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బీదర్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా ఎండు గంజాయిని సరపర చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేర
గంజాయి సప్లై


హైదరాబాద్, 10 జూలై (హి.స.)

కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి

హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తుమ్న ఎండు గంజాయి ని గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బీదర్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా ఎండు గంజాయిని సరపర చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు గురువారం ఉదయం మునిపల్లి మండలం కమకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా ఓ స్కూటీపై అనుమానం రావడంతో ఆపి తనిఖీ చేశాయగా అందులో ఉన్న 6 కిలోల 400 గ్రాముల ఎండు గంజాయి పట్టుకొని సీజ్ చేశారు. ఎండు గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడు మొహమ్మద్ సమీర్ బీదర్ లోని ఇరానీ గల్లీలో తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాదులో అధిక ధరకు అమ్ముతున్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande