హైదరాబాద్, 10 జూలై (హి.స.)
తాజాగా వర్క్ ఫ్రం హోం అంటూ ఓ మహిళను సైబర్ నేరస్తులు మోసం చేశారు. మోసానికి నష్టపోయి, కలత చెందిన ఆ మహిళ చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లో గురువారం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ పీఎస్ ప్రాంతానికి చెందిన మహిళ సైబర్ నేరగాడి బారినపడి ఆర్థికంగా మోసపోయిన అనూష బలవన్మరాణానికి పాల్పడింది. అనూషకు వర్క్ ఫ్రంహోమ్ ఇప్పిస్తానని ఓ సైబర్ నేరగాడు నమ్మించి మోసం చేశాడు. దాంతో ఆమె సుమారు రూ.లక్ష నగదు పోగొట్టుకుంది.పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని భావించింది. అయితే సైబర్ నేరగాళ్లు స్పoదించలేదు. చివరికి తాను సైబర్ నేరగాల మోసానికి బలి అయ్యానని గుర్తించింది. సైబర్ మోసానికి అనూష కలత చెందింది. గురువారం కుమారుడిని నిద్రపుచ్చి.. అనూష ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు ముందు అనూష లేఖ రాసింది. తన మాదిరి టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్