పెద్దపల్లి జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
తెలంగాణ, పెద్దపల్లి 10 జూలై (హి.స.) పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల, అంతర్గాం కెజిబివి పాఠశాలలో అటవిశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పెద్దపల్లి జిల్లా అటవిశాఖ అధికారి శివయ
వన మహోత్సవం


తెలంగాణ, పెద్దపల్లి 10 జూలై (హి.స.) పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల

కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల, అంతర్గాం కెజిబివి పాఠశాలలో అటవిశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పెద్దపల్లి జిల్లా అటవిశాఖ అధికారి శివయ్య తో పాటు సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.

మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం ఎంపిడిఓ వేణుమాధవ్, ఫారెస్ట్ అధికారులు కొమురయ్య, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande