ఎగువన కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరంలో ప్రాణహిత పరవళ్లు..
హైదరాబాద్, 10 జూలై (హి.స.) కాళేశ్వ‌రం వ‌ద్ద ప్రాణ‌హిత నది ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. గత వారం రోజుల నుండి ఎగువన మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి కాళేశ్వరం వద్ద గోదావరి నది లో క‌లుస్తోంది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల
ప్రాణహిత నది


హైదరాబాద్, 10 జూలై (హి.స.)

కాళేశ్వ‌రం వ‌ద్ద ప్రాణ‌హిత నది ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. గత వారం రోజుల నుండి ఎగువన మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి కాళేశ్వరం వద్ద గోదావరి నది లో క‌లుస్తోంది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రాణహిత నదిలో కలవడంతో ప్రాణహిత నదిలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది.మేడిగ‌డ్డ బ్యారేజ్ వ‌ద్ద ఇన్‌ఫ్లో 5.3 ల‌క్ష‌ల క్యూసెక్కులుకాళేశ్వరం వద్ద గోదావరి నది 10.450 మీటర్ల ఎత్తు నుండి ప్రవహిస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ లో 5.30 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో 85 గేట్లు ఎత్తి అధికారులు ఈ నీటిని దిగువ‌కు వదులుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande