తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 10 జూలై (హి.స.)
అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న ఫైనాన్స్, వడ్డీ వ్యాపారస్తులపై పోలీసులు కొరడా ఝులిపించారు. గురువారం జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే ఆదేశాల మేరకు పోలీసులు 20 టీమ్ లగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఎనిమిది మంది అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సుమారు రూ.60 లక్షల విలువ గల వివిధ డాక్యుమెంట్లతో పాటుగా తాకట్టు పెట్టుకున్న పలు వాహనాలు(4 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో) స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు