జగిత్యాల.10 జూలై (హి.స.)
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం
విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తో కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా లో నిర్లక్ష్యం వహిస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ విసిరిన సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి తోక ముడిచాడని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిక సీట్లు కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై తక్కువ రోజులలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని,సంపూర్ణంగా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత బయట పడుతుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..