పాఠశాలను ఆకస్మిక తనికి నిర్వహించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్
తెలంగాణ, సంగారెడ్డి. 10 జూలై (హి.స.) సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం హోతి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ పీ. ప్రావీణ్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ అక్కడ లేకపోవడం చర్చనీయాంశంమైం
సంగారెడ్డి కలెక్టర్


తెలంగాణ, సంగారెడ్డి. 10 జూలై (హి.స.) సంగారెడ్డి జిల్లాలోని

జహీరాబాద్ మండలం హోతి

గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ పీ. ప్రావీణ్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ అక్కడ లేకపోవడం చర్చనీయాంశంమైంది. కలెక్టర్ వారికోసం ఆరా తీయగా తప్పుడు సమాచారంతో సిబ్బంది తప్పుదోవ పట్టించారని సమాచారం. మొగుడంపల్లి, హోతి(కే) రెండు కేజీబీవీ పాఠశాలలు హోతి(కే)లోని భవనంలోనే కొనసాగుతున్నాయి. సుమారు ఐదువందల మంది పిల్లలు చదువుతున్నారు. మధ్యాహ్నం నలుగురు సిబ్బంది, ఇద్దరు ప్రిన్సిపల్స్ పాఠశాలలో లేరు. ఈ సందర్భంలోనే కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ హఠాత్ పరిణామంతో స్థానిక సిబ్బంది అయోమయానికి గురయ్యారు. వచ్చిన వెంటనే కలెక్టర్ హాజరు రిజిస్టర్ తీసుకొని పేర్లు చదువుతూ వివరాలు ఆరాతీశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande