హైదరాబాద్, 10 జూలై (హి.స.)
ప్రయాణికులకు సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ పలు చర్యలు చేపట్టింది. కాలం చెల్లిన బస్సులను పక్కన పెడుతూ 422 కొత్త బస్సుల ను అందుబాటులో తీసుకు రానుంది. మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరగడంతో అందుకు అనుగుణంగా బస్సులు నడపాలని సంస్థ నిర్ణయించింది. 15 ఏళ్లు దాటిన లేదా 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను పక్కన పెట్టడానికి ఆర్టీసీ నిర్ణయించిందని తెలిసింది. ఇప్పటికే కాలంచెల్లిన 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్‌లను, 17 ఎక్స్‌ప్రెస్ లు, 22 డీలక్స్‌ల స్థానంలో కొత్త బస్సులు రోడ్లపైకి రానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్