హైదరాబాద్, 10 జూలై (హి.స.)
హైదరాబాద్ నగర పోలీస్ శాఖ
మందుబాబులకు షాకిచ్చింది. ఈనెల 13వ తేదీ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా రెండ్రోజులపాటు మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నగర పోలీస్ కమిషనరేట్ 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మద్యం షాపులు మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సీపీ ఆదేశాలతో హైదరాబాద్ సెంట్రల్, ఈస్ట్, నార్త్ జోన్ల పరిధిలోని గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారాంగేట్, మారేడ్ పల్లి, మహంకాళి, రామ్ గోపాల్ పేట్, మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని మద్యం షాపులు రెండ్రోజులు మూతపడనున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..