విజయవాడ, 11 జూలై (హి.స.)
, :రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థలకు సీఆర్‌డీఏ మొబిలైజేషన్ అడ్వాన్సులు అందించింది. ఇప్పటి వరకు రూ.337.46 కోట్లు చెల్లించింది. దీంతో పనులు మరింతగా పరుగులు పెట్టనున్నాయి. రాజధాని పరిధిలో రూ.45వేల కోట్ల విలువైన పనులు దశల వారీగా ప్రారంభమవుతున్నాయి. ఎన్‌సీసీ లిమిటెడ్‌కు రూ.125.64 కోట్లు, బీఎ్‌సఆర్ ఇండియా లిమిటెడ్ (బీఎ్‌సఆర్‌ఐఎల్)కు రూ.71.42 కోట్లు, ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఆర్‌వీఆర్)కు రూ.49.80 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ సంస్థకు రూ.90.60 కోట్లు చొప్పున మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ