కృష్ణా.నదిపై నిర్మించిన శ్రీశైలం డ్యాం దగ్గర గేట్లు ఎత్తివేత
అమరావతి, 11 జూలై (హి.స.) కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం డ్యామ్‌ దగ్గర.. గేట్లు ఎత్తినప్పుడు.. ఆ కృష్ణమ్మ పరవళ్లు తొక్కే విధానం అందరినీ కట్టిపడేస్తోంది.. రెగ్యులర్‌గా శ్రీశైలం వెళ్లేవారు సైతం.. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తినప్పుడు మరోసారి వెళ్లి వద
కృష్ణా.నదిపై నిర్మించిన శ్రీశైలం డ్యాం దగ్గర  గేట్లు ఎత్తివేత


అమరావతి, 11 జూలై (హి.స.)

కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం డ్యామ్‌ దగ్గర.. గేట్లు ఎత్తినప్పుడు.. ఆ కృష్ణమ్మ పరవళ్లు తొక్కే విధానం అందరినీ కట్టిపడేస్తోంది.. రెగ్యులర్‌గా శ్రీశైలం వెళ్లేవారు సైతం.. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తినప్పుడు మరోసారి వెళ్లి వద్దాం అనుకుంటారు.. అలాంటి వాతావరణం అక్కడ ఉంటుంది.. శ్రీశైలం డ్యామ్‌ నుంచి దూకే కృష్ణమ్మ పాలనురగలా.. అందరినీ ఆకట్టుకుంటుంది.. ఇక, డ్యామ్‌ పరిసరాల్లో.. వర్షంలా పడే ఆ తుంపర్లలో సేదతీరితూ ఎంజాయ్‌ చేస్తుంటారు పర్యటకులు, శివయ్య భక్తులు.. ఈ ఏడాది కూడా శ్రీశైలం గేట్లు ఎత్తడంతో.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యటకులు తరలివస్తున్నారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande