హైకోర్టులో సిద్ధరామయ్యకు ఊరట.. బీజేపీ వేసిన పరువు నష్టం కేసు నిలిపివేత
బెంగళూరు, 11 జూలై (హి.స.) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. సిద్ధరామయ్యపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో “అవినీతి రేటు కార్డు ప్రకటనపై బీజేపీ పరువు నష్టం కే
సిద్ధరామయ్య


బెంగళూరు, 11 జూలై (హి.స.)

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. సిద్ధరామయ్యపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో “అవినీతి రేటు కార్డు ప్రకటనపై బీజేపీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఫిర్యాదులో సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ పేర్లు పొందిపరిచారు. 2023 ఎన్నికల ప్రచారంలో బీజేపీ లంచం తీసుకున్నట్లు ప్రకటనలో కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా దిగువ కోర్టు కార్యకలాపాలను కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. దీంతో ముఖ్యమంత్రికి మధ్యంతర ఉపశమనం లభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande