అమరావతి, 11 జూలై (హి.స.)
గంగావతి, : తుంగభద్ర ఎడమ కాలువలో దూకి ప్రేమికులు గల్లంతైన ఘటన మునిరాబాద్ డ్యామ్ చైన్ 28 వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సణాపురకు చెందిన అంజలి (18), నింగాపుర యువకుడు ప్రవీణ్‌కుమార్ ప్రేమించుకున్నారు. ఈక్రమంలో ఇళ్ల నుంచి పారిపోయి హగరిబొమ్మనహళ్లిలోని బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందారు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లి అక్కడికి కారు పంపించి ఇద్దరిని ఇంటికి రప్పించే ప్రయత్నం చేసింది. వారు అందులో తిరిగివస్తూ కాలకృత్యాలు తీర్చుకోవాలంటూ మునిరాబాద్ డ్యామ్ వద్ద కారును ఆపారు. కిందికి దిగి తుంగభద్ర ఎడమకాలువలో దూకేశారు. ప్రేమికుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మునిరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను గాలించి వెలికితీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ