అమరావతి, 11 జూలై (హి.స.)
విజయవాడ: మద్యం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్ ఎదుట హాజరయ్యారు. అధికారులు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. శుక్రవారం 10 గంటలకు రజత్ భార్గవ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. అనారోగ్యం రీత్యా రాలేనని బదులిచ్చారు. కానీ, తప్పనిసరిగా హాజరుకావాలని సిట్ స్పష్టం చేయడంతో ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు. వైకాపా హయాంలో రజత్ భార్గవ ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. దీంతో మద్యం విధానంపై విడుదలైన జీవోలు, లావాదేవీలు తదతర విషయాలపై సిట్ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు, అధికారుల్ని సిట్ విచారించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ