మాటలు అందరూ చెప్పారు.. చేసి చూపించింది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి..! రేణుక చౌదరి
తెలంగాణ, ఖమ్మం 11 జూలై (హి.స.) ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శుక్రవారం జరిగిన సమావేశంలో మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై ప్రస్తుత సీఎం ర
రేణుక చౌదరి


తెలంగాణ, ఖమ్మం 11 జూలై (హి.స.) ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శుక్రవారం జరిగిన

సమావేశంలో మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిను ప్రశంసలతో ముంచెత్తారు. ఇది రాజకీయ నిర్ణయం కాదని, సామాజికంగా గొప్ప మార్పునకు నాంది అని అభివర్ణించారు. అలాగే, ఇవ్వాళ నాకు చాలా గర్వంగా ఉంది. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రజలందరికీ గర్వపడే రోజులు ఇవి అని రేణుకా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సామాజిక న్యాయం సాధ్యమవుతోందని తెలిపారు.

ఎవరెవరో మాటలు చెప్పారు కానీ.. చేసి చూపించింది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆమె స్పష్టం చేశారు. గురువారం జరిగిన కేబినెట్ తీసుకున్న 42% బీసీ రిజర్వేషన్ నిర్ణయం వల్ల వారికి రాజకీయాల్లోనే కాదు.. ఉద్యోగాల్లోనూ మెరుగైన అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande