ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో ఫీజు పెంపున‌కు హైకోర్టు నో…
హైదరాబాద్, 11 జూలై (హి.స.) ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు లో బిగ్ షాక్ తగిలింది. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్‌ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులను విడుదల చేసింది. ఆరు వారాలలోపు ఇంజినీరింగ్‌ ఫీజుల ను నిర్ణయించాలని ఫీజుల
హైకోర్టు


హైదరాబాద్, 11 జూలై (హి.స.)

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు లో బిగ్ షాక్ తగిలింది. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్‌ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులను విడుదల చేసింది. ఆరు వారాలలోపు ఇంజినీరింగ్‌ ఫీజుల ను నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర సర్కార్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు బిగ్ షాక్ తగిలినట్లు అయింది.ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో ప్రైవేట్ కళాశాలలు ఎదురు చూస్తున్న ఫీజుల పెంపు ఆశలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే నిర్వహాణ ఖర్చులు పెరిగాయని, నాణ్యమైన విద్యకు తగిన వనరులు కావాలంటూ ప్రైవేట్ కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, హైకోర్టు మాత్రం చట్టపరమైన ప్రక్రియలో ముందుకెళ్లాలని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే, ఫీజుల పెంపుపై స్పష్టత రానంత వరకూ అడ్మిషన్ ప్రక్రియలో అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande