హైదరాబాద్, 11 జూలై (హి.స.)
పెరుగుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భూ తాపాన్ని తగ్గించేందుకు దేశ ప్రధాని పిలుపుమేరకు త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బీఈఈ దక్షిణ భారత ప్రాంతీయ మీడియా సలహాదారు ఎ. చంద్ర శేఖర రెడ్డి, ఈఈఎస్ఎల్ సీనియర్ అధికారులతో కలిసి శుక్రవారం ఇంధన సామర్థ్య రంగంలో కీలక పరిణామాలపై గవర్నర్‌ను కలిసి వివరించారు. ఈసందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ విధానం ఆర్ధిక, పర్యావరణంతోపాటు సమాజానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని నొక్కి చెప్పారు. వాతావరణ చర్యలపై ప్రపంచ సమాజాన్ని ఏకం చేసే దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్