చెన్నై, 11 జూలై (హి.స.)
: తిరుమల డెయిరీ చెన్నై ట్రెజరీ మేనేజరు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన నవీన్ బొలినేని(37) చెన్నై మాధవరంలోని తిరుమల డెయిరీలో ట్రెజరీ మేనేజరుగా పని చేస్తున్నాడు. కంపెనీలో లెక్కలు చూడగా అతను రూ.40 కోట్లు మోసానికి పాల్పడినట్లు తెలిసింది. అందుకు అంగీకరించిన అతను ఒక్కరోజులో నగదు ఇస్తానని చెప్పినట్లు సమాచారం. డబ్బు ఇవ్వలేకపోయిన నవీన్ పుళల్ బ్రిటానియానగర్‌లో తనకు చెందిన షెడ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు ఏపీలోని తన సోదరీమణులకు ఈ-మెయిల్ పంపినట్లు తెలిసింది. వెంటనే వారు చెన్నై వచ్చి చూడగా ఆత్మహత్య చేసుకొని కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనను ఐదుగురు అధికారులు బెదిరిస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈ-మెయిల్‌లో ఉన్నట్లు సమాచారం వెలువడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ