నేడు ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం
అమరావతి, 11 జూలై (హి.స.) నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు..
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం


అమరావతి, 11 జూలై (హి.స.)

నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.. ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్‌ కుమార్‌, ఉన్నతాధికారులు.. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు నాయుడు.. జనాభాపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది..

ఇప్పటికే జనాభాలో యువత తగ్గడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. రాబోయే పదేళ్లలో వృద్ధులు ఎక్కువ అవుతారని గణాంకాలు చెబుతున్నాయి.. దీంతో, జనాభా పెరుగుదల ఆవశ్యకతను సీఎం చంద్రబాబు వివరించే అవకాశం ఉంది.. మరోవైపు, దక్షిణ భారతంలో జనాభా తగ్గుదలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.. గతంలో.. ఒక్కరు ముద్దు.. ఇద్దరు చాలు అని ప్రచారం చేసిన ప్రభుత్వాలు.. ఇప్పుడు.. ముగ్గురుని కనండి.. నలుగురైతే నష్టమేంటి అనేవిధంగా తమ నిర్ణయాలను మార్చుకుంటున్నాయి.. పిల్లలను బరువుగా భావించకుండా.. ఆస్తిగా పరిగణించాలని కూడా చెబుతున్నారు.. దీంతో, ఇవాళ జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందంటున్నారు.. లో

ఇక, ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమనికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు.. కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్తారు.. మరోవైపు, హైదరాబాద్ నుంచే ఎల్లుండి సాయంత్రం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande