తెలంగాణ, షాద్నగర్. 12 జూలై (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత . రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్లే వ్యక్తిగా, రాష్ట్రానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు అమ్మాయిలకు స్కూటీలు , పెళ్లికి లక్ష రూపాయల నగదు, తులం బంగారం ఇస్తామని చేసిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ప్రారంభించాలంటూ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూర్ గ్రామంలో కవిత పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉండేది తక్కువని.. ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటారని వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలతోనే నిండి ఉన్నాయని ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు