కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాలు స‌హ‌క‌రించుకుంటేనే అభివృద్ధి – రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 12 జూలై (హి.స.) సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకున్నప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ మ
Cm revanth


హైదరాబాద్, 12 జూలై (హి.స.)

సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకున్నప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ ముఖ్యమంత్రి ని జూబ్లీహిల్స్ నివాసంలో నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం చేపట్టిన, చేపడుతున్న వివిధ పథకాలు, ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ముఖ్యమంత్రి ఆయ‌నకు వివరించారు. కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకున్నప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెంది తద్వారా దేశం పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.“రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవల రంగం అభివృద్ధి కోసం పలు ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande