ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ వేయాలి: ఈటల రాజేందర్
హైదరాబాద్, 12 జూలై (హి.స.) పర్మినెంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగా కమిటీలు వేశారో ఆదే రకంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉపసంఘం వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పర్మి
ఈటెల


హైదరాబాద్, 12 జూలై (హి.స.)

పర్మినెంట్ ఉద్యోగుల సమస్యల

పరిష్కారం కోసం ఏ రకంగా కమిటీలు వేశారో ఆదే రకంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉపసంఘం వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పర్మినెంట్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా అంతే మంది ఉన్నారని.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేయకపోతే కొన్ని శాఖలు పూర్తిగా పని చేయని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇవాళ ఇందిరాపార్క్ దర్నాచౌక్ లో చేపట్టిన తెలంగాణ ఔట్ సోర్స్ ఉద్యోగుల మహా ధర్నాకు ఈటల సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసమే ఇవాళ ఇవాళ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడెక్కారని వీరికి ఈపీఎఫ్, పీఎఫ్ తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు సర్వీస్ సెక్టార్ కింద వస్తాయని సర్వీస్ సెక్టార్ కింద పని చేసే ఉద్యోగులకు సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయడం అన్యాయం అన్నారు. ప్రైవేట్ సెక్టార్ విషయం ఎలా ఉన్నా ప్రభుత్వ సంస్థల్లోని ఔట్ సోర్సింగ్ ఎజెన్సీ జీఎస్టీ రద్దుకు పార్టీలకు అతీతంగా కృషి చేస్తానన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande