నాగర్ కర్నూల్:, 12 జూలై (హి.స.)
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్తుండటంతో శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చూసేందుకు పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. దీంతో అమ్రాబాద్ మండలం పాతాళగంగ నుంచి దోమలపెంట చెక్ పోస్టువరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయ రహదారిపై 10 కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ