మహబూబ్నగర్, 12 జూలై (హి.స.)
పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భారతీయ స్టేట్ బ్యాంక్ మహబూబ్ నగర్ రీజినల్ మేనేజర్ రామ్మూర్తి సూచించారు. శనివారం స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానంలో బ్రాంచి మేనేజర్లతో కలిసి ప్రజలకు సైబర్ నేరాల పట్ల వారు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ప్రతి రోజు కొత్త కొత్త పద్దతులతో ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఒక వేళ పొరపాటున మోసపోతే, వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సైబర్ నేరం వివరాలు ఇవ్వాలని కోరారు.
తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు చెప్పవద్దని మరియు అపరిచిత కాల్స్ కు రెస్పాండ్ కావద్దని వారు వివరించారు. అలాగే తెలియని యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోకూడదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్