కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉంది..? మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్
హైదరాబాద్, 12 జూలై (హి.స.) బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేము చేపట్టినప్పుడు కవిత జైలులో ఉన్నారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. తీహార్ జైలులో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలని డి
మహేష్ కుమార్ గౌడ్


హైదరాబాద్, 12 జూలై (హి.స.)

బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేము చేపట్టినప్పుడు కవిత జైలులో ఉన్నారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. తీహార్ జైలులో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విప్లవాత్మక నిర్ణయాలు అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మేము సాధించిన రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన విజయమని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని కవిత మాట్లాడారని చెప్పుకొచ్చారు. కవిత మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటోందని విమర్శలు చేశారు. కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా? అని ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande