పేద‌ల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం : మంత్రి కోమ‌టిరెడ్డి
తెలంగాణ, నల్గొండ. 12 జూలై (హి.స.) పేదల సంక్షేమమే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి అన్నారు. శనివారం వారు నల్లగొండ జిల్లాలో తిప్పర్తి, మాడుగులపల్లి, నల్లగొండ పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ర‌వాణా శ
మంత్రి కోమ‌టిరెడ్డి


తెలంగాణ, నల్గొండ. 12 జూలై (హి.స.)

పేదల సంక్షేమమే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి అన్నారు. శనివారం వారు నల్లగొండ జిల్లాలో తిప్పర్తి, మాడుగులపల్లి, నల్లగొండ పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ , మంత్రి కోమ‌టిరెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వాని దేనని అన్నారు. పేద ప్రజలకు అన్ని రకాల సేవ చేసే భాగ్యం కలగడం తమ‌ అదృష్టమని వ్యాఖ్యానించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande