నవంబర్ లోగా ఫ్యాక్టరీ నిర్మించకుంటే స్థలం ఖాళీ చేయాల్సిందే : మంత్రి తుమ్మల
తెలంగాణ, ఖమ్మం. 12 జూలై (హి.స.) ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో ఈ ఏడాది నవంబర్ నెలలోపు గోద్రెజ్ ఆగ్రో వెట్ మెగా ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించకపోతే రైతులు ఇచ్చిన స్థలాలను ఖాళీ చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర
మంత్రి తుమ్మల


తెలంగాణ, ఖమ్మం. 12 జూలై (హి.స.) ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో ఈ ఏడాది నవంబర్ నెలలోపు గోద్రెజ్ ఆగ్రో వెట్ మెగా ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించకపోతే రైతులు ఇచ్చిన స్థలాలను ఖాళీ చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. మంత్రి తుమ్మల శనివారం అంజనాపురం గ్రామంలో పామాయిల్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గోద్రెజ్ ఆగ్రో వెట్ మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ఫ్యాక్టరీ నిర్మించే స్థలంలో రైతులతో పామాయిల్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పామాయిల్ మొక్కలు పంపిణీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. నవంబర్ లోపు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పార్టీలో రిఫైండరీ వ్యవస్థ ప్రారంభమైతే తెలంగాణ మొత్తం పామాయిల్ ముడి సరుకును ఇక్కడికే పంపిస్తామని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande