అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం.. పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
తెలంగాణ, పెద్దపల్లి 12 జూలై (హి.స.) అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట, కూనవరం, గంగారం, పందిళ్ళ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చే
పెద్దపెల్లి ఎమ్మెల్యే


తెలంగాణ, పెద్దపల్లి 12 జూలై (హి.స.)

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట, కూనవరం, గంగారం, పందిళ్ళ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేసి ముగ్గులు పోశారు.

వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా వారు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande