తెలంగాణ, ఖమ్మం. 12 జూలై (హి.స.)
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో సీతారామ ప్రాజెక్టు నుంచి అధికారులు సాగునీటికై గోదావరి జలాలను విడుదల చేశారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ నుంచి శనివారం ఉదయం నీటిని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న దృష్ట్యా రైతుల వినతికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఈ విషయమై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సంప్రదించారు. పరిస్థితి వివరించారు. ఈ విషయమై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతోనూ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శనివారం ఉదయం సమీక్ష చేశారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు