ప్రాచీన ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తెలంగాణ, నిర్మల్ 12 జూలై (హి.స.) బోథ్ నియోజకవర్గంలోని ప్రాచీన ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని శివంబి కేశవ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఆ
ఎమ్మెల్యే అనిల్ జాదవ్


తెలంగాణ, నిర్మల్

12 జూలై (హి.స.)

బోథ్ నియోజకవర్గంలోని ప్రాచీన ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని శివంబి కేశవ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలవే కాదు, సాంస్కృతిక పరంపరను కొనసాగించేవి కూడా. వాటిని అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది, ప్రజల్లో ఐక్యత, సాన్నిహిత్యం మరింత బలపడుతుందన్నారు. అలాగే దేవాలయాల అభివృద్ధి గ్రామీణ పర్యాటకానికి కూడా తోడ్పడుతుందని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని ప్రధాన ఆలయాలకు నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande