జోగులాంబ గద్వాల, 12 జూలై (హి.స.)
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలోని మారమునగాల గ్రామ శివారులో కృష్ణా నదిలో శనివారం చేపలను పట్టడానికి వెళ్ళిన జాలరి వెంకట్రాముడుకు 20 కిలోల భారీ బాహుబలి బొచ్చ చేప లభ్యమయింది. మానోపాడు గ్రామస్తులు ఎనిమిది మంది కలిసి ఆ చేపను కొనుగోలు చేశారు. కిలో 280 చొప్పున 5,600 వేల రూపాయల వరకు ధర పలకడంతో జాలరి సంతోషం వ్యక్తం చేశాడు. ఇలాంటి చేపలు అరుదుగా లభిస్తాయని స్థానిక జాలర్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్