నగరంలో చిరుత భయం.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..
హైదరాబాద్, 12 జూలై (హి.స.) గ్రేటర్‌ హైదరాబాద్ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. బాలాపూర్‌లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రీసెర్చ్‌ సెంటర్ ఇమారత్‌లో రెండు చిరుతల సంచరించడం నిజమేనని అధికారులు తేల్చారు. చిరుతల సంచారంతో స
చిరుతలు


హైదరాబాద్, 12 జూలై (హి.స.)

గ్రేటర్‌ హైదరాబాద్ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. బాలాపూర్‌లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రీసెర్చ్‌ సెంటర్ ఇమారత్‌లో రెండు చిరుతల సంచరించడం నిజమేనని అధికారులు తేల్చారు. చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఒంటరిగా బయట తిరగొద్దని అధికారులు ప్రకటించారు. దీంతో చిరుతల సంచారం స్థానికంగా సంచలనంగా మారింది.గతంలోనూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుసగా చిరుత పులులు సంచరించాయి. నగర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్పుడు అటవి అధికారులు శ్రమించి నగర శివార్లలో తిరుగుతున్న పులులను పట్టుకున్నారు. అనంతరం వాటిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. నాటి నుంచి చిరుతల కదలికలు కనిపించలేదు. కానీ శుక్రవారo రాత్రి సమయంలో బాలాపూర్ శివారు ప్రాంతాల్లో చిరుతల సంచరించడం మళ్లీ కలకలం రేపింది. బాలాపూర్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ ప్రాంగణంలో చిరుతల సంచారాన్ని స్థానికులు గమనించారు. రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు చిరుతల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande