హైదరాబాద్, 12 జూలై (హి.స.)
భారతీయ న్యాయ వ్యవస్థ చాలా భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉందని సీజేఐ బీఆర్ గవాయ్ తెలిపారు. హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల ఆధారంగా వెళ్లాలని, కుటుంబంపై ఆర్థిక భారం మోపకుండా ఉండాలని ఆయన సూచన చేశారు. మన భారతీయ న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఆ సవాళ్లకు తగినట్లు పౌరులు రాణిస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మన దేశం, న్యాయ వ్యవస్థ.. రెండూ భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కొన్ని కేసుల్లో విచారణ దశాబ్ధాల పాటు సాగుతుందని, కొన్నేళ్లు జైలు జీవితం అనుభవించిన తర్వాత వాళ్లు నిర్దోషులని కొన్ని కేసుల్లో తేలుతున్నాయని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్