ఈ సారి జీహెచ్ఎమ్సీ మేయర్ పీఠం బీజేపీదే: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, 13 జూలై (హి.స.) త్వరలో జరగబోయే జీహెచ్ఎమ్సి ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీ నే కైవసం చేసుకుంటుందని తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. గోల్కోండ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేందర్ ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు బేగం బజార్ల
బీజేపీ చీఫ్


హైదరాబాద్, 13 జూలై (హి.స.)

త్వరలో జరగబోయే జీహెచ్ఎమ్సి ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీ నే కైవసం చేసుకుంటుందని తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. గోల్కోండ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేందర్ ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు బేగం బజార్లో ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో రాంచందర్ రావు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ సమావేశానికి వచ్చి రాంచందర్ రావును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అధ్యక్షుడిగా తాను ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరి నుంచి ఎటువంటి హాని వచ్చినా తాను ముందుండి... వారిని ఎదుర్కొంటానని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అలాగే త్వరలో జీహెచ్ఎమ్సీ కి జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక కార్పోరేటర్లను గెలుచుకొని.. గ్రేటమ్ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని.. ఆ దిశగా ప్రతి కార్యకర్తలతో కలిసి ముందు వెళ్తామని చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande