తెలంగాణ, జహీరాబాద్. 13 జూలై (హి.స.)
రక్తదానం ప్రజల ప్రాణాలను కాపాడుతుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. ఆదివారం కోహీర్ పట్టణంలోని ఇండియన్ స్కూల్ ఆధ్వర్యంలో తలసేమియా రోగుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్రావు మాట్లాడుతూ.. అన్నదానం కంటే రక్తదానం చాలా గొప్పదన్నారు. అన్నదానం ఒక పూట ఆకలిని తీరుస్తుందన్నారు. కానీ రక్తదానం రోగుల జీవితాన్ని కాపాడుతుందని వివరించారు.
తలసేమియా రోగులకు 15 నుంచి 20 రోజులకు ఒకసారి కచ్చితంగా రక్తం అవసరం ఉంటుందని వెల్లడించారు. రక్తం అందుబాటులో లేకపోతే రోగులు మరణించే అవకాశం ఉంటుందన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమలో ఉండే భయాన్ని విడిచిపెట్టాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు