అమరావతి, 13 జూలై (హి.స.)
విశాఖ నగరంలో కొంత సమయంపాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలతోపాటు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. 16వ వార్డు కేఆర్‌ఎం కాలనీలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహానికి రెండు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ