సినీ నటుడు కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు ముగిసాయి
అమరావతి, 13 జూలై (హి.స.) హైదరాబాద్‌: సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. ఇందులో అభిమానులు పాల్గొని నివాళులర్ప
సినీ నటుడు కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు ముగిసాయి


అమరావతి, 13 జూలై (హి.స.)

హైదరాబాద్‌: సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. ఇందులో అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలు జరిగాయి.

తన విలక్షణ నటనతో తెలుగు సినీ ప్రియులకు చేరువైన కోట శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande