కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కు అప్పగించండి ...మూడు రోజుల్లో సాగునీరు అందిస్తాం : జగదీశ్వర్ రెడ్డి
తెలంగాణ, గోదావరిఖని. 13 జూలై (హి.స.) తెలంగాణ రాష్ట్రం లో రైతంగానికి సాగునీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను గోస పెడుతుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రైతాంగానికి సాగు నీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్న
జగదీశ్వర్ రెడ్డి


తెలంగాణ, గోదావరిఖని. 13 జూలై (హి.స.)

తెలంగాణ రాష్ట్రం లో రైతంగానికి సాగునీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను గోస పెడుతుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రైతాంగానికి సాగు నీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు... రైతంగానికి నీళ్లవ్వడం చేతకాకపోతే కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని అన్నారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మాజీ ఎమ్మెల్యే చందర్ నివాసంలో నేడు వారు విలేఖరులతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి లో ముందుకు సాగి సుభిక్షంగా ఉంటే అజ్ఞాని రెవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్రం తిరోగమనం వెళ్లిందన్నారు. అసమర్ధ పాలనలో ప్రజలు విసిగిపోతున్నారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి సరిపడా సాగునీటిని సరఫరా చేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande