యువతలో చైతన్యం నింపేందుకు కోట ఎంతో కృషి చేశారు: కిషన్ రెడ్డి
హైదరాబాద్, 13 జూలై (హి.స.) నటుడు కోటా శ్రీనివాస రావు మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. విలక్షణ నటుడు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు కోటా శ్రీనివాస రావు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. వారు అనేక
Kishan Reddy


హైదరాబాద్, 13 జూలై (హి.స.)

నటుడు కోటా శ్రీనివాస రావు మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. విలక్షణ నటుడు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు కోటా శ్రీనివాస రావు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. వారు అనేక అంశాలపై లోతైనా అవగాహనా కలిగిన వ్యక్తి వారితో నాకు ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. కోటా శ్రీనివాస రావు సనాతన ధర్మం, సామాజిక విలువలు, భాషా పరిరక్షణ తదితర విషయలపై సమాజంలో మరి ముఖ్యంగా యువతలో చైతన్యం నింపేందుకు ఎంతో కృషి చేశారని అన్నారు.

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించి తెలుగు సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును చాటుకున్నారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. వారి సేవలను గుర్తించి 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించుకుంది. వారి మృతి సినీ రంగానికి తెలుగు సమాజానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande