కోట మరణంపై బండి సంజయ్, ఈటల సంతాపం..
హైదరాబాద్, 13 జూలై (హి.స.) కోట శ్రీనివాస్ మరణంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లో చెరగని ముద్ర వే
బండి సంజయ్, ఈటల


హైదరాబాద్, 13 జూలై (హి.స.)

కోట శ్రీనివాస్ మరణంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్నో జాతీయ, నంది అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఉమ్మడి ఏపీలో బీజేపీని ఆయన గుర్తించారు. అసెంబ్లీలో సినీ రంగ సమస్యలపై నిత్యం మాట్లాడేవారు. కోట శ్రీనివారావు మరణం భారతీయ జనతా పార్టీకి, సినిమా రంగానికి తీరని లోటు. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ చెప్పారు బండి సంజయ్.

ఎంపీ ఈటల రాజేందర్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ లీడర్, కోట శ్రీనివాస్ రావు మరణం బాధ కలిగించింది. ఆయన రాజకీయాల్లో, అటు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేశారు. విలక్షణ నటుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న కోట శ్రీనివాస రావు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినిమాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు ఈటల.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande