తెలంగాణ, వనపర్తి. 13 జూలై (హి.స.)
పిల్లల చదువు విషయంలో నిర్లక్ష్యం అర్థం కుటుంబాల భవిష్యత్తును నాశనం చేయడమే,” అంటూ మంత్రి వాకిటి శ్రీహరి విద్యాధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే లక్షలాది రూపాయలు ఖర్చుచేసి స్కూళ్లకు వసతులు కల్పిస్తున్నా, ఉపాధ్యాయులు పిల్లల ఫలితాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించారు.
వనపర్తి జిల్లా అమరచింతలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు గదులు, అలాగే సింగంపేట గ్రామంలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, పూర్తిగా వసతులు కల్పిస్తున్నాం, కానీ ఫలితాల కోసం పకడ్బందీగా పని చేయాల్సిన అవసరం ఉంది” అన్నారు.
“సంజాయిషీలు చెప్పడం కాదు, మెరుగైన ఫలితాలు చూపించాలి,” అంటూ హెడ్మాస్టర్, ఉపాధ్యాయులపై మంత్రి శ్రీహరి సీరియస్ అయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు