రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పింఛను
అమరావతి, 13 జూలై (హి.స.) అమరావతి: రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్‌ను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాల్లోని 1,575 కుటుంబాలకు పింఛన్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం ఈ పింఛన్లను రద్దు
రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పింఛను


అమరావతి, 13 జూలై (హి.స.)

అమరావతి: రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్‌ను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాల్లోని 1,575 కుటుంబాలకు పింఛన్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం ఈ పింఛన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మంత్రిమండలి భేటీలో పునరుద్ధరణకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణంలో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు పింఛన్లను మంజూరు చేస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2015లో జరిపిన ఇంటింటి సర్వే ఆధారంగా 1,575 కుటుంబాలు పింఛన్లకు అర్హులుగా గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande