హైదరాబాద్, 13 జూలై (హి.స.)
మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం పైదాడి జరిగిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పందించారు. క్యూ న్యూస్ ఆఫీస్ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ మల్లన్న గన్మెన్ల వల్ల ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఇరు వర్గాల తోపులాటలో ఆఫీస్ అద్దాలు పగిలాయి. కొందరికి గాజు పెంచులు గుచ్చొని బ్లడ్ వచ్చింది. దాడి చేయడానికి వచ్చిన జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాం. విచారిస్తున్నామని సీపీ వెల్లడించారు.
కాగా, క్యూ న్యూస్ కార్యాలయంలోని ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేస్తున్న ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్